Union governament favour to Delimitation of Assembly seats in AP and Telangana .For political gain Bjp favour to delimitaton of Assembly seats in AP and Telangana states. <br />ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బీజేపీ సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయమై మరోసారి కదలిక వచ్చినట్టు సమాచారం. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులతో బాబు చర్చించారని సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు బిజెపి మొగ్గు చూపడం ఆ పార్టీ వైఖరిలో మార్పుకు సంకేతమనే అభిప్రాయాన్ని రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన విషయమై కొంత కాలంగా చర్చ సాగుతోంది. అయితే తొలుత ఈ విషయమై సానుకూలంగా బిజెపి ఉన్నట్టు కన్పించింది. అయితే ఆరు మాసాల క్రితం నియోజకవర్గాల పెంపు కారణంగా రాజకీయంగా తమకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని బిజెపి భావించింది. ఈ కారణంగా నియోజకవర్గాల పెంపు పట్ల బిజెపి కొంత అయిష్టతతో ఉందనే ప్రచారం సాగింది.